ప్రొద్దుటూరు, ఆగస్టు 27: ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొద్దుటూరులో ఉచిత ఆక్యుపంచర్, మర్మకళ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. రాజీవ్ సర్కిల్ సమీపంలోని NGO హోమ్‌లో ఉదయం 9.30 గంటలకు శిబిరం ప్రారంభమవుతుంది.
డాక్టర్ సాదిక్ బాషా ఆధ్వర్యంలో 21 రకాల థెరపీ పద్ధతులతో వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తలనొప్పి, మైగ్రేన్, మెడనొప్పి, సయాటికా తదితర సమస్యలకు వైద్య సలహాలు, చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి 2వ కోర్టు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కె.సి. లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
Was this article useful?



