అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 18వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా బిస్మిల్లా డ్రైవింగ్ స్కూల్ యజమాని బదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారుల చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారాన్ని అందుకున్నారు. అనంతరం బదర్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో 18వ వార్డులో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను 18వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, మున్సిపల్ చైర్మన్ బోనమల ఖాదరవల్లి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.



