Breaking

DYFI రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

జమ్మలమడుగు: సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగనున్న DYFI 16వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జమ్మలమడుగులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమకు నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరుణ్, మహేష్, తరుణ్, సంతోష్, పెద్దన్న పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.