Breaking

పాఠశాలల వద్ద ‘స్కూల్‌ జోన్‌’ బోర్డులు

పులివెందుల: విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల వద్ద ‘స్కూల్‌ జోన్‌’ బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల వెంట ఉన్న పాఠశాలల సమీపంలో ఈ బోర్డులను ఏర్పాటు చేశారు.

పాఠశాలల వద్దకు చేరుకునే సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు. పులివెందుల ట్రాఫిక్‌ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.