పులివెందుల: విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల వద్ద ‘స్కూల్ జోన్’ బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల వెంట ఉన్న పాఠశాలల సమీపంలో ఈ బోర్డులను ఏర్పాటు చేశారు.
పాఠశాలల వద్దకు చేరుకునే సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు. పులివెందుల ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Was this article useful?



