బద్వేలు, ఆగస్టు 5: బద్వేలు పట్టణంలోని 23వ వార్డు (ఫాతిమా మసీదు పరిసర ప్రాంతం)లో బుధవారం నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాల వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు, ‘తల్లికి వందనం’ పథకం, ఉచిత ఇసుక విధానం, చేనేత కార్మికులకు అందిస్తున్న రాయితీలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



