ప్రొద్దుటూరు: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, లైన్లు, డీటీఆర్లలో నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఆగస్టు 22న నాలుగో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు. నిర్వహణ పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.కె. చాంద్ బాష, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రవీంద్ర శ్రీనివాసుల రెడ్డి కోరారు.
Was this article useful?



