Breaking

2029 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం: సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

పోరుమామిళ్ల: బీజేపీ, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, 2029లో జరిగే 19వ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని సీపీఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. పోరుమామిళ్లలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ శాస్త్రీయ రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎన్.భైరవ ప్రసాద్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.