ప్రొద్దుటూరు: పట్టణంలోని 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా 1వ వార్డు టీడీపీ ఇన్చార్జి యనమల రామసుబ్బారెడ్డి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దాదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, 1వ వార్డు మాజీ కౌన్సిలర్ పొడావుల వెంకటరమణ తదితరులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు యనమల ఉమామహేశ్వర్‌రెడ్డి, దాదిరెడ్డి రవీంద్రారెడ్డి, పొడవుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



