,జమ్మలమడుగు: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేష్ బాబు సూచించారు. గురువారం పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో హెల్మెట్ తలకు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సీఐ సూచించారు.
Was this article useful?



