ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘వృక్ష ప్రొద్దుటూరు’ లక్ష్యంతో ప్రొద్దుటూరు ఐక్యవేదిక, సంస్కృతి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్ల కళ్యాణ మండపం సమీపంలో పెన్నా నది తీరంలోని పాత బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా వేప, రావి, కానుగ, కొండసుంకేసుల తదితర రకాల 90 మొక్కలను నాటారు. ఐక్యవేదిక అధ్యక్షులు డా. డి. నాగ దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యాన్ని తగ్గించేందుకు హరిత ప్రొద్దుటూరు దిశగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్కృతి సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, డా. టి.డి. వరుణ్కుమార్రెడ్డి, ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.



