ప్రొద్దుటూరు: స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని పలు నరసింహస్వామి ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వైఎంఆర్ కాలనీలోని సుదర్శన నరసింహస్వామి ఆలయం, సినీహబ్ సమీపంలోని నరసింహస్వామి ఆలయం, నరసింహాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నరసింహాపురం ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
Was this article useful?



