ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 3తో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవుతుందని, అనంతరం అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ప్రతి స్థానిక సంస్థలో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. శాసనసభ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ప్రతిష్ఠాత్మకమైనవని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని రాచమల్లు పిలుపునిచ్చారు.
Was this article useful?



