చక్రాయపేట: కుమార కాల్వ గ్రామంలో చక్రాయపేట ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గ్రామస్తులతో సమావేశమైన ఎస్ఐ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, లింక్లు, మెసేజ్లకు స్పందించకుండా జాగ్రత్త వహించాలని, మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ చంద్రశేఖర్ సూచించారు.
Was this article useful?



