డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. బొల్లారంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ గోశాలలో ఆవులకు పశుగ్రాసం అందించడంతో పాటు, విద్యార్థి అనాథ శరణాలయంలోని చిన్నారులకు దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అవసరమైన వారికి చేయూత అందించడం, మూగజీవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, దియ్య రవి, రమేష్, చంద్రాయుడు, గోసేవకులు, మిత్రబృందం పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని అర్థవంతంగా జరుపుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.



