Breaking

సునీల్ యాదవ్  వ్యాఖ్యలపై వైసీపీ నేతల మండిపాటు

పులివెందుల: వైఎస్‌ కుటుంబంపై సునీల్‌ యాదవ్‌ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వైసీపీ నాయకులు విమర్శించారు. వ్యక్తిగత ప్రచారం కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయ విమర్శలు ఉంటే ఆధారాలతో మాట్లాడాలని సూచించారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ తరచూ తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులు చేస్తూ భద్రత కోరడం సరైన విధానం కాదని నాయకులు పేర్కొన్నారు. ఆయా ఫిర్యాదులపై పోలీసులు చేపట్టిన విచారణలో వాస్తవాలు ఏంటో అధికారికంగా తేలాల్సి ఉందన్నారు.

వైఎస్‌ జగన్‌, భారతి తదితరులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ కుటుంబంపై ఎవరు పడితే వారు ఇష్టానుసారం మాట్లాడటం సహించేది లేదని, ఆరోపణలు చేస్తే వాటికి ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సుంకర రవి, నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు చెన్నూరు కార్తీక్‌, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఏకశి మహేష్‌, యూత్‌ నాయకుడు అరవింద్‌ పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.