బద్వేలు, ఆగస్టు 20: బద్వేలు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.50 వేల విలువైన చెక్కులను టీడీపీ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Was this article useful?



