ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: ప్రొద్దుటూరు సబ్‌జైలును మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా 2వ అదనపు జడ్జి సత్యకుమారి బుధవారం తనిఖీ చేశారు. జైలులోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఖైదీలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఖైదీల హక్కులు, న్యాయ సహాయం పొందే విధానం, అందుబాటులో ఉన్న న్యాయ సేవలపై వారికి అవగాహన కల్పించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



