మదనపల్లె: విద్యార్థులకు 1098, 112 టోల్‌ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లా శిశు సంక్షేమ మరియు సాధికారత, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం కింద చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది బుధవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ సంధ్యారాణి, కేస్ వర్కర్ షబీనా విద్యార్థులకు బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాలను వివరించారు. వేధింపులకు గురయ్యే బాలల రక్షణ, సంరక్షణ కోసం 1098 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు. బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న సహాయ మార్గాలను వివరించారు.
Was this article useful?



