ప్రొద్దుటూరు: ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆదివారం ఉదయం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్లో వాకర్లను కలిశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు, మాజీ కౌన్సిలర్ రామసంజీవరెడ్డి, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు షామీర్ భాషా, కంభం రామాంజనేయరెడ్డి, జిల్లెళ్ల వెంకటేష్, దేశిరెడ్డి గురువిరెడ్డి, కదిరి రామకృష్ణారెడ్డి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



