ప్రొద్దుటూరు, ఆగస్టు 5: ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి వైభవంగా సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, విరాటపర్వ పారాయణం, వరుణ హోమం, మహాపూర్ణాహుతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం ఆలయ తిరుమాడ వీధుల్లో శోభాయాత్ర చేపట్టి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కేవీ రమణ, చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
Was this article useful?



