రాజుపాలెం: రాజుపాలెంలోని శివప్రియ హైస్కూల్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ‘నశాముక్త భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్య రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. బీకే శాంత, బీకే సౌజన్య మాట్లాడుతూ డ్రగ్స్, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు రాజయోగ ధ్యానం చేయించారు. ఎంఈఓ రామస్వామి రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వీరారెడ్డి, ఉపాధ్యాయులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు పాల్గొన్నారు
Was this article useful?



