పులివెందుల, సెప్టెంబర్ 30: వైఎస్ కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేశారంటూ సునీల్ యాదవ్పై వైసీపీ నాయకులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, సంబంధిత వీడియోను కూడా అందజేశారు.
వైరల్ అవుతున్న వీడియోలోని వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినట్లు తేలితే వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.
Was this article useful?



