ప్రొద్దుటూరు: స్థానిక మెయిన్బజార్లోని అమ్మవారిశాలలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి తల్లం వీరయ్య శ్రేష్ఠి మెమోరియల్ వృద్ధాశ్రమ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించారు. అధ్యక్షుడిగా కామిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడిగా కాకుమాని సుబ్బారావు, కార్యనిర్వహక కార్యదర్శిగా మురికి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పసుపుల సుబ్రమణ్యం, సహాయ కార్యదర్శిగా వెంకట నరసింహరావు, ఖజాంచీగా తల్లం వెంకట ద్వారకానాథ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా జొన్నలగడ్డ రవీంద్రబాబు, సీవీ సురేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్రావు మాట్లాడుతూ వృద్ధాశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వృద్ధులకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని నూతన పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ సభ్యులు పాల్గొన్నారు.



