రాయచోటి: శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగుల పుట్ట వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు సమర్పించి నాగదేవతను పూజించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Was this article useful?



