రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామ హృదయం కలశ పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలకు చెందిన కలశాలకు అర్చకులు శ్రీ యోగి స్వామి, శ్రీ శంకర స్వామి పూజలు నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు, రాయచోటి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మండలాల కన్వీనర్లకు కలశాలను అందజేశారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈఓ డి.వి. రమణారెడ్డి, పాలకమండలి సభ్యులు, భక్తులు, కన్వీనర్లు పాల్గొన్నారు.



