ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు వివేకా హత్య, లిక్కర్ కేసులను ప్రస్తావిస్తోందని విమర్శించారు.
వివేకా హత్య కేసులో అసలు నిందితులకు శిక్ష పడేలా చూడాలని, కేసును రాజకీయ కోణంలో కాకుండా న్యాయపరంగా ముగించాలని ఆయన అన్నారు. దస్తగిరి, సునీల్ యాదవ్ చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పెరుగుతున్నాయని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాక వారు ఆందోళనలు చేస్తున్నారని రాచమల్లు విమర్శించారు. వివేకా హత్య కేసులో జగన్మోహన్రెడ్డి, భారతి పేర్లను రాజకీయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.



