ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 22: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో మంగళవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. పవర్ హౌస్ కాంపౌండ్‌లోని రామేశ్వరం అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ అదాలత్ జరగనుంది.
చైర్పర్సన్ (ఇన్చార్జి), ఆర్థిక సభ్యులు బి. మధుకుమార్, సాంకేతిక సభ్యులు ఏ. జయకృష్ణ రెడ్డి, స్వతంత్ర సభ్యులు డబ్ల్యూ. విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్, రామేశ్వరం, రూరల్, రాజుపాలెం సెక్షన్లకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసి అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.



