పులివెందుల స్మార్ట్ కిచెన్‌ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, వంటకాల నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కోడి గుడ్లను కూడా పరిశీలించారు.
విద్యార్థుల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు కలగకుండా నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని, తయారీ నుంచి పాఠశాలకు చేరే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
Was this article useful?



