ప్రొద్దుటూరు, సెప్టెంబరు 24: వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు గణితశాస్త్ర ప్రాముఖ్యత, ఆలోచనా శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు ఇండక్షన్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. అలెక్స్ “Explain Minds, Empowering Minds”, ప్రొఫెసర్ ఎస్. సునీత “Mathematics from Numbers to Intelligence” అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ల్యాబ్లు, లైబ్రరీ, పోటీ పరీక్షల పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి. జయచంద్రారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Was this article useful?



