బాలల రక్షణ, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిషన్ వాత్సల్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 112 అత్యవసర సేవల నంబర్లపై వివరించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ, POCSO చట్టం, బాల కార్మిక వ్యవస్థ, పిల్లల అక్రమ రవాణా, భిక్షాటనపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు లేని పిల్లల దత్తత ప్రక్రియ, వారికి అందే స్కాలర్‌షిప్‌లపై వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మేరీ షుక్రియ, కేస్ వర్కర్లు రోహిత శిరీష, ఇర్షాద్, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



