వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి అఖిలానందన్పై సైన్స్ టీచర్ జావిద్ దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేసిన ఘటనపై AISP కడప జిల్లా అధ్యక్షుడు సిదిగే దినేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భద్రతకు భంగం కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగినా సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Was this article useful?



