Breaking

వాగ్దానాలే తప్ప.. అమలు ఎక్కడ? : రాచమల్లు

ప్రొద్దుటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై స్పందించిన ఆయన, ప్రభుత్వం చెప్పే గణాంకాలు కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రజలు మాత్రం ఆ ప్రయోజనాలను చూడలేకపోతున్నారని అన్నారు.
సంక్షేమ పథకాలపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా, ఏ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ డీబీటీ, నాన్-డీబీటీ పథకాల ద్వారా విస్తృత స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, అమలు చేసిన పథకాల పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.