ప్రొద్దుటూరు: ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధిని కాంక్షిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఆదివారం ఆచారి కాలనీలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వరుణ హోమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విశ్వకర్మ సమైక్య విశ్వబ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వడ్ల శ్రీనివాసచారి తదితరులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. పలువురు విశ్వబ్రాహ్మణులు, రైతులు, మహిళలు పాల్గొని వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రార్థించారు.
Was this article useful?



