పులివెందుల, సెప్టెంబరు 23: వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాతే వినియోగించాలని, దోమల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో చెత్త వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు అందించాలని తెలిపారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు గుర్తిస్తే వెంటనే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కమిషనర్ కోరారు. మున్సిపాలిటీ చేపడుతున్న డ్రైనేజీ శుభ్రత, ఫాగింగ్ వంటి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.



