జమ్మలమడుగు: అంజనేయపురం గ్రామంలో జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. గుర్తుతెలియని కాల్స్, లింకులకు స్పందించి ఓటీపీ, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Was this article useful?



