బద్వేలు, ఆగస్టు 7: హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన ఏరోనాటికల్ ఇంజనీర్ ఎద్దుల ఇంద్రసేనారెడ్డి (28) మృతి చెందాడు. ఆయన అట్లూరు మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేఖరి ఎద్దుల కుమారుడు. చదువు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంద్రసేనారెడ్డి మృతదేహం శనివారం స్వగ్రామమైన కొండూరుకు చేరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Was this article useful?



