బైక్కు అడ్డుగా వచ్చిన కుక్క.. అదుపుతప్పి కిందపడిన సిబ్బంది
వేంపల్లి: కడపలో బెటాలియన్ విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తున్న ఇద్దరు హోంగార్డులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మార్గమధ్యంలో బైక్కు కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి వారు కిందపడినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో చక్రాయపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర, వేముల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వేమయ్య గాయపడినట్లు తెలిసింది. వీరిద్దరూ వేంపల్లికి చెందిన హోంగార్డులుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది.
బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో సహచర సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



