పులివెందుల: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పులివెందుల మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేస్తామని టీడీపీ పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి తెలిపారు. మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు రూ.28 లక్షలతో నిర్మించిన నూతన గదులను కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
కొత్త గదుల ద్వారా మార్కెట్ కమిటీకి నెలకు సుమారు రూ.40 వేల అద్దె ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పులివెందుల మార్కెట్‌ను చీనీతో పాటు అరటి పంటకు కూడా విస్తరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోకుండా ప్రతి పంచాయతీలో గాలి వేగం కొలిచే మీటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌తో చర్చిస్తున్నట్లు చెప్పారు.
మార్కెట్ కమిటీ కాంపౌండ్, గేటు, ఆర్చ్ నిర్మాణానికి రూ.22 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, డీఎంఎఫ్ నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని బీటెక్ రవి వెల్లడించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.



