వేంపల్లి, అక్టోబర్ 1: వేంపల్లి రైతుబజార్లో రైతులు, చిరు వ్యాపారులపై వివిధ రకాల వసూళ్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు. గురువారం రైతుబజార్‌ను సందర్శించిన ఆయన రైతులు, వినియోగదారులు, చిరు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
రైతుబజార్ల ఏర్పాటు లక్ష్యం రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు సరసమైన ధరలకు కూరగాయలు అందించడమేనని తెలిపారు. అయితే వేంపల్లి రైతుబజార్లో రైతులు, చిరు వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి వసూళ్లపై పరిశీలన చేసి రైతులు, వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ప్రభుత్వం రైతుబజార్లలో కిలో ఉల్లిని రూ.35కు విక్రయిస్తున్న నేపథ్యంలో వేంపల్లి రైతుబజార్‌లోనూ రాయితీ ఉల్లి విక్రయాలను ప్రారంభించాలని తులసిరెడ్డి కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



