ప్రొద్దుటూరు, ఆగస్టు 7: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి అమలు తదితర డిమాండ్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రాజుపాలెం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థి విభాగం ప్రతినిధులు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మారుతి ప్రసాద్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్న వారికి మజ్జిగ, పండ్ల రసం అందించి దీక్షను విరమింపజేశారు.
Was this article useful?



