ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 6 నుంచి చేపట్టనున్న పార్టీ కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



