Breaking

రబీకైనా కేసీ నీరు ఇవ్వాలని తీర్మానం

దువ్వూరు, ఆగస్టు 28: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కేసీ కాలువ కింద సాగుకు నీరు అందించే అవకాశం లేదని ఇరిగేషన్ ఏఈ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం దువ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీ కాలువకు నీరు వస్తుందా అని సభ్యులు ప్రశ్నించగా ఖరీఫ్‌కు నీటి సరఫరా సాధ్యం కాదని ఏఈ స్పష్టం చేశారు.
మండలంలో కేసీ ఆయకట్టు కింద 12,600 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 2,400 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రబీ సీజన్‌లోనైనా కేసీ కాలువకు నీరు అందించి ఆరుతడి పంటలకు అవకాశం కల్పించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు ఎంపీడీవో జవహర్‌బాబు తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.