కడప జిల్లా: బి.మఠం మండలంలో ఆదివారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. రజక అన్నదాన సత్రం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడు సుబ్బారాయుడు, హైమావతి దంపతుల కుమారుడిగా గుర్తించారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ మద్యానికి బానిసై తరచూ గొడవపడేవారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ శివప్రసాద్ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
Was this article useful?



