పులివెందుల: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పులివెందులలో జనసేన నాయకుడు హితేష్ రాయల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ హితేష్ రాయల్ కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Was this article useful?



