ప్రొద్దుటూరు, ఆగస్టు 28: యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. దొరసానిపల్లెలోని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నివాసంలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువజన సమావేశం నిర్వహించారు.
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన, రాచమల్లు రాఘవేంద్రరెడ్డి, బండి వినీత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించారు. ఎన్నికల సమయంలో నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు ఆరోపించారు. ఈ అంశాలపై యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు, కార్యకర్తలు, పలువురు యువకులు పాల్గొన్నారు.



