ప్రొద్దుటూరు: మైనర్లు వాహనాలు నడపకుండా అరికట్టేందుకు ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మైనర్లు నడుపుతున్న 10 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరగడంతోపాటు వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. లైసెన్స్ పొందిన తర్వాతే వాహనాలు నడిపేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



