ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 2: మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఆర్ట్స్ కాలేజ్ నాలుగు రోడ్ల కూడలిలో ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మొత్తం 20 కేసులు నమోదు చేసి రూ.15,650 జరిమానా విధించారు. మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడిన బాలల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడకుండా వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Was this article useful?



