వైసీపీ నుంచి ఐదు.. టీడీపీ నుంచి రెండు దాఖలు**
మైదుకూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీలో శుక్రవారం తొలి రోజున ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్సీపీ తరఫున ఐదు, టీడీపీ నుంచి రెండు నామినేషన్లు నమోదయ్యాయి. ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. తొలి రోజు పరిమిత సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా, మిగిలిన రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Was this article useful?



