ప్రొద్దుటూరు: మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ న్యాయమైన నియామకాలకు మద్దతుగా నిర్వహిస్తున్న ఆత్మగౌరవ ర్యాలీకి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మెగా డీఎస్సీ అభ్యర్థులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 42 మంది అభ్యర్థులు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించనున్న ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరారు.
మెగా డీఎస్సీ–2025 ద్వారా వేలాది మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించడంతో పాటు, నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ర్యాలీలో పాల్గొననున్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్‌కుమార్‌ను నియమించారు. అభ్యర్థుల తరలింపు కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా పాల్గొని వారికి మద్దతు తెలిపారు.



